ఉందిలే మంచి కాలం. ..ముందు ముందున
మొబైల్ లో పాత సినిమా పాట...ఉందిలే మంచికాలం ముందు ముందున ...అని చిన్నగా వినిపిస్తోంది. చలికాలం అవ్వటంతో నెమ్మదిగా చీకటితో పాటు చలిగాలి కూడా పెరుగుతోంది. అప్పటిదాకా వాకింగ్ చేసి కాసేపు పాట వింటూ రిలాక్స్ అవుదామని కూర్చున్నానో లేదో ఎవరో వస్తున్న అలికిడికి నేను వెంటనే మాస్క్ తగిలించేసుకుని జాగ్రత్త పడిపోయా.మా పక్క ఫ్లాట్ వాళ్ళు వాకింగ్ చేయటానికి టెర్రస్ మీదకి వచ్చి నన్ను చూసి గబ గబా మాస్కులు తగిలించేసుకుని నాకు ఆమడ దూరంగా వాకింగ్ చేయటం మొదలు పెట్టారు. యిక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టెర్రస్ దిగి యింటికి వచ్చేసా. ఈ కరోన దెబ్బకి మా డాబా మీద ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది.రోడ్డు మీద,పార్కులో వాకింగ్ చేసే మా అపార్ట్మెంట్ వాసులు అందరూ డాబా బాట పట్టారు.మాలో మేము ఒక ఒప్పందం చేసుకుని స్టిఫ్టుల ప్రకారం కొంతమంది పొద్దున్న,కొంతమంది సాయంకాలం వాకింగ్ చేస్తున్నాం . అబ్బాబ్బా... ఈ మాస్కులు వాడి వాడి చెవులు విపరీతమైన మంట. యిలానే కొన్నాళ్ళు పెట్టుకుంటే చెవులు ముందుకు పొడుచుకుని వచ్చి ఏలియన్స్ లా అయిపోవడం ఖాయం. అందరి మొహాలకి మాస్కులయితే ఉంటున్నాయి. కానీ ఏం లా