మైమరపించిన వేణుగానం....
నీ మువ్వల సవ్వడి విని నిన్ను వెతుకుతూ నే వస్తే నీ నుండి రాలి పడిన జాజి పువ్వులు , నీ లేత పాదాలను ముద్దాడిన యీ పచ్చిక బయళ్ళు ఈ దారి వెంటే నీవు నడిచి వెళ్ళావని చెప్పకనే చెబుతున్నాయి. నీవు నడిచి వెళ్ళిన దారంతా రాలిపడిన యీ పొగడపువ్వులు,నిన్ను తాకి వింత కాంతితో మరింత అందంగా మెరిసిపోతున్న యీ వెండి వెన్నెల నీ స్పర్శతో పులకరించిపోతూ ఈ దారి వెంటే నీవు నడిచి...