పి.భా.స ....పెద్దలకు మాత్రమే
వారంరోజుల ముందుగానే యింటింటికి వచ్చి ఆదివారం జరగబోయే పి.భా.స సభకి రమ్మనమని నిర్వాహకులు పిలిచేసరికి అసలు యీ పి.భా. స సభ గురించి ఎప్పుడు విని వుండకపోవటంతో అదేంటో చూద్దామని మేము యిద్దరం వెళ్ళాం.అన్నట్లు చెప్పటం మరిచిపోయా.ఈ సభకి 15 సంవత్సరాలు దాటిన పిల్లలున్న పేరెంట్స్ మాత్రమే రావాలని రూల్ కూడా పెట్టారు.యిదేదో మాకు పనికివచ్చే విషయంలా నా సిక్స్తసెన్స్ చెప్పేసరికి వాళ్ళు చెప్పిన టైం కంటే అరగంట ముందుగా బయలుదేరి వెళ్ళాం.ఆడిటోరియం అంతా అప్పటికే మాలాంటి పేరెంట్స్ తో నిండిపోయి ఉంది.ఎలాగో అలా అందరిని తోసుకుంటూ ముందుకు వెళ్ళి ఒకరిద్దరితో పొట్లాడి మరీ కష్టపడి సీట్లు సంపాదించి కూర్చుని చూద్దుము కదా.. అక్కడి వచ్చిన పేరెంట్స్ అందరి మోహల్లో అక్కడేదో అద్భుతం జరగబోతోందన్న ఫీలింగ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెల్లిగా సభ ప్రారంభమైంది. ఒక్కొక్కరిగా వచ్చి పరిచయం చేసుకున్న నిర్వాహకులు, సభాదక్షుడు ఉపన్యాసాలతో గంటలు గంటలు ఉదర కొట్టకుండా క్లుప్తంగా మాట్లాడి యిక పి.భా.స గురించి మాట్లాడమని ఆ రోజు ముఖ్య అతిధిగా పిలిచిన పెద్దమనిషిని ఆదరం...