Posts

Showing posts from November, 2017

సారు...జరా సంజాయించరాదె...

Image
           ఈ దినం అమెరికా ప్రెసిడెంటన్నా  ట్రంప్ గారి కూతురు ఇవాంకమ్మ వస్తోందని మా హైద్రాబాద్  గల్లీ,గల్లీ పెళ్ళి కూతురు లెక్క ముస్తాబు చేసిండ్రు. ఔ...మల్ల , చార్మినార్ కి సుట్టు ఉన్న నాలుగు గల్లీలకి రంగురంగుల బల్బులెట్టినారంటా,బ్రిడ్జిలకి,కనిపించిన గోడలన్నింటిని గావేవో పిట్ట బొమ్మలు,చెట్టు బొమ్మలతో మస్తు నింపేసినారంటా. యాదు కొచ్చింది... మన ప్రధాన మంత్రాన్న దిల్ కుష్ చేయటానికి పొద్దుగూకులు  దాదేదో స్వచ్ భారత్ అంటుంటాడని ఊరంతా ఏడేడ నుండో పూల తొట్లు యెత్తుకొఛ్చి మాస్త్ ముస్తాబు చేసిండ్రులే.గన్నట్లు అసలు విషయం చెప్పటం మరిచినా. ఇవాంకమ్మ  హైద్రాబాద్ చూస్తుందని రోడ్ల మీద ఉన్న బొక్కలు...గదె బిడ్డా  గోతులు,గుంతలు అన్ని ఎత్తి పూడ్చినారుటా..మాఫీ   చేయున్ద్రి.చెన్నైలో ఉన్నప్పటి సంధి మధ్య మధ్య ఆరవ భాష వచ్చి పూడ్చినాది.... గోతులు,గుంతలు పూడ్చేసినారంట,ఏడ పడితే ఆడ  కుప్ప తొట్లు కూడా మస్తు పెట్టిండ్రులే,ఈ దినం టీవీ లో చూసినా.    ఇవాంకమ్మ పుణ్యమా అంటూ ఊరంతా పండుగ మారి మాస్త్ ముస్తాబు చేసిండ్రుటా.జనాలు మాస్త్ ఖుషి ఖుషి అయిండ్రు. ఇవంకమ్మ నెలకొ తూరు గిట్లా మన దేశానికి రావాలని  హైద్రాబాద్ జనాలు వాట్స

సర్వం సెల్ ఫోనుమయం

Image
       ఈరోజు అన్నవరంలో మా రామం  బాబాయిగారి  రెండో కూతురి పెళ్ళికి  వెళ్ళాలని పొద్దున్నే నిద్ర లేచిన నాకు  అప్పటికే  నిద్ర లేచేసి  పక్క మీద నుండి దిగకుండానే అలానే కళ్ళు నలుపుకుంటూ వాట్సాప్ లో మెసేజిలు పెడుతున్న మా శ్రీవారిని  చూస్తుంటే  ఒళ్ళు మండిపోయింది.పెళ్లయి యిన్నాళ్ళూ అయినా  పక్కనే ఉన్న నన్ను చూసి  గుడ్మార్నింగ్ అని  చెప్పటం కానీ,ప్రేమగా పలరించటం కానీ ఏఒక్కనాడు చేయరు కానీ ఆ  దిక్కుమాలిన  వాట్సాప్ వచ్చినప్పటినుండి దానితో ఊరందరిని ఆప్యాయంగా పలకరించేస్తూ మధ్య మధ్య వాళ్ళు పెట్టె రిప్లైలు చూసి మురిసిపోతూ ఉంటారు.           ఇంతకీ నేను చెప్పొచ్చే విషయం  ఏమిటంటే  అన్నవరంలో పెళ్ళి అంటే  అటు  స్వామి వారిని దర్శించుకున్నట్లు ఉంటుంది, యిటు పెళ్ళి చూసినట్లు ఉంటుంది అని అనుకుని  వైజాగ్ లో ఉన్న  మా చుట్టాలందరితో కలిసి  సరదాగా కబుర్లాడుకుంటూ వెళదామని  సరిపోకపోయినా అలానే యిరుక్కుని అందరం కలిసి  ఒకే కారులో బయలుదేరాం.దారి పొడుగునా  మా డ్రైవర్  ఒక చెత్తో  కారుని డ్రైవ్ చేసేస్తూ మరోపక్క సెల్ ఫోనులో మాట్లాడుతూ, మధ్య మధ్య పక్కనే కూర్చున మా పుత్రరత్నం తీసే సెల్ఫీలకి నవ్వుతూ రకరకాల పోజులు యిచ్చేస్తూ ఉం

Devudu digi vachina vaela

Image

కురిసింది వాన...

Image
             తొలకరి చినుకులలో తడిసిన మట్టి వాసనతో కలిసిన చల్లటి గాలి నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా నెమ్మదిగా తాకుతూ ముందుకు సాగిపోతోంది. కురుస్తున్న  వర్షాన్ని చూస్తూ ఆలోచనాల్లోకి జారుకున్నా.        చిన్నప్పుడు వాన  కురుస్తుంటే  ఆ వానలో నేను  తడుస్తూ ఆడుకుంటూ అక్కడక్కడా నిలిచిన నీటి గుంటలలో ఎగిరి దూకుతూ  ఆడుకున్నంతసేపు ఆడుకుని అలానే వర్షంలో  పూర్తిగా తడిసిపోయి  యింటికి వచ్చినందుకు అమ్మ తివాట్లు పెడుతూ నాకు  జలుబు చేస్తుందేమో అని గబ గబా తలారబెట్టి నాకు పెద్ద గ్లాసుడు మీగడ  పాలు యిచ్చి, నిప్పుల కుంపటి మీద లేత మొక్కజొన్న పొత్తులు విసనకర్రతో విసురుతూ కాలుస్తూ ఉండేది. అమ్మ పక్కనే కూర్చుని చూస్తున్న నేను గబ గబా పాలు తాగేసి కండే గింజల కోసం చేయీ చాస్తే... అమ్మ నవ్వుకుని  నా కోసం లేత కండే  వెతికి గింజలు వలిచి వేడిగా ఉన్నాయంటూ ఊదుతూ నా చేతిలో పెడుతు వుండేది. సాయంకాలం నాన్న ఆఫీస్ నుండి వస్తూ వస్తూ సందు చివర బుజ్జిగాడి కోట్లో కట్టించుకుని వచ్చే  వేడి, వేడి పచ్చిమిరపకాయ బజ్జిలు, పునుగులు ఉల్లిపాయ చట్నీ చూస్తూ నోరూరిపోయి ఎవరూ లేకుండా చూసి  నన్నంతలా ఊరించేస్తున్న పచ్చిమిరపకాయ బజ్జిని క