సారు...జరా సంజాయించరాదె...

  
        ఈ దినం అమెరికా ప్రెసిడెంటన్నా  ట్రంప్ గారి కూతురు ఇవాంకమ్మ వస్తోందని మా హైద్రాబాద్  గల్లీ,గల్లీ పెళ్ళి కూతురు లెక్క ముస్తాబు చేసిండ్రు. ఔ...మల్ల , చార్మినార్ కి సుట్టు ఉన్న నాలుగు గల్లీలకి రంగురంగుల బల్బులెట్టినారంటా,బ్రిడ్జిలకి,కనిపించిన గోడలన్నింటిని గావేవో పిట్ట బొమ్మలు,చెట్టు బొమ్మలతో మస్తు నింపేసినారంటా. యాదు కొచ్చింది... మన ప్రధాన మంత్రాన్న దిల్ కుష్ చేయటానికి పొద్దుగూకులు  దాదేదో స్వచ్ భారత్ అంటుంటాడని ఊరంతా ఏడేడ నుండో పూల తొట్లు యెత్తుకొఛ్చి మాస్త్ ముస్తాబు చేసిండ్రులే.గన్నట్లు అసలు విషయం చెప్పటం మరిచినా. ఇవాంకమ్మ  హైద్రాబాద్ చూస్తుందని రోడ్ల మీద ఉన్న బొక్కలు...గదె బిడ్డా  గోతులు,గుంతలు అన్ని ఎత్తి పూడ్చినారుటా..మాఫీ   చేయున్ద్రి.చెన్నైలో ఉన్నప్పటి సంధి మధ్య మధ్య ఆరవ భాష వచ్చి పూడ్చినాది.... గోతులు,గుంతలు పూడ్చేసినారంట,ఏడ పడితే ఆడ  కుప్ప తొట్లు కూడా మస్తు పెట్టిండ్రులే,ఈ దినం టీవీ లో చూసినా.
   ఇవాంకమ్మ పుణ్యమా అంటూ ఊరంతా పండుగ మారి మాస్త్ ముస్తాబు చేసిండ్రుటా.జనాలు మాస్త్ ఖుషి ఖుషి అయిండ్రు. ఇవంకమ్మ నెలకొ తూరు గిట్లా మన దేశానికి రావాలని  హైద్రాబాద్ జనాలు వాట్సాప్,ఫేస్ బుక్ లలో మస్తు ముచ్చట్లు పెట్టిండ్రు.
     నాకు తెలవక అడుగుతుండా సారు....ఆ యమ్మ గమెరికాకి వెళ్ళి పోయిన తరువాత ఈ రంగు రంగుల బల్బులు,పూల తొట్లు,సీసీ కెమెరాలు,  కుప్ప తొట్లు  ఆడనే ఉంటాయా,లేక గవర్నమెంటు సారు వాడు గుంజుకుంటారా...సారు,జరా సంజాయించరాదె...

Comments

Popular posts from this blog

మా బడి మాకెంతో ఇష్టం...

My morning run

అమ్మ చేతి ముద్ద

ప్రేమతో.....అమ్మ

పి.భా.స ....పెద్దలకు మాత్రమే