సర్వం సెల్ ఫోనుమయం
ఈరోజు అన్నవరంలో మా రామం బాబాయిగారి రెండో కూతురి పెళ్ళికి వెళ్ళాలని పొద్దున్నే నిద్ర లేచిన నాకు అప్పటికే నిద్ర లేచేసి పక్క మీద నుండి దిగకుండానే అలానే కళ్ళు నలుపుకుంటూ వాట్సాప్ లో మెసేజిలు పెడుతున్న మా శ్రీవారిని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది.పెళ్లయి యిన్నాళ్ళూ అయినా పక్కనే ఉన్న నన్ను చూసి గుడ్మార్నింగ్ అని చెప్పటం కానీ,ప్రేమగా పలరించటం కానీ ఏఒక్కనాడు చేయరు కానీ ఆ దిక్కుమాలిన వాట్సాప్ వచ్చినప్పటినుండి దానితో ఊరందరిని ఆప్యాయంగా పలకరించేస్తూ మధ్య మధ్య వాళ్ళు పెట్టె రిప్లైలు చూసి మురిసిపోతూ ఉంటారు.
ఇంతకీ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే అన్నవరంలో పెళ్ళి అంటే అటు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఉంటుంది, యిటు పెళ్ళి చూసినట్లు ఉంటుంది అని అనుకుని వైజాగ్ లో ఉన్న మా చుట్టాలందరితో కలిసి సరదాగా కబుర్లాడుకుంటూ వెళదామని సరిపోకపోయినా అలానే యిరుక్కుని అందరం కలిసి ఒకే కారులో బయలుదేరాం.దారి పొడుగునా మా డ్రైవర్ ఒక చెత్తో కారుని డ్రైవ్ చేసేస్తూ మరోపక్క సెల్ ఫోనులో మాట్లాడుతూ, మధ్య మధ్య పక్కనే కూర్చున మా పుత్రరత్నం తీసే సెల్ఫీలకి నవ్వుతూ రకరకాల పోజులు యిచ్చేస్తూ ఉంటే వాడు కార్ పోనిచ్చిన స్పీడ్ కి హడలిపోయి మేమందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నామంటే నమ్మండి.సదరు డ్రైవరు బాబు డ్రైవింగ్ స్పీడుకి కడుపులో తిప్పి కొందరు,కడుపు ఉబ్బిపోయి మరికొందరు అలానే ఆపసోపాలు పడుతూ అన్నవరం చేరుకున్నాం.అలా వెళ్ళి వెళ్ళగానే చాలా రోజుల తరువాత బంధువులందరిని కలుసుకోబోతున్నానన్న సంతోషంతో క్షణం ఆలస్యం చేయకుండా గబగబా తయారయ్యి పెళ్ళికి వెళ్ళి చూద్దును కదా...వచ్చిన బంధవులు ఎవరి మానాన వాళ్ళు కూర్చుని సెల్ ఫోన్లు చూసుకునే వాళ్ళు కొంతమంది అయితే మరికొంతమంది పెళ్ళికి వచ్చిన బంధువులతో సెల్ఫీలు తీసుకుంటూ వాట్సప్ లో ఫోటోలు ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తూ కనిపించారు. యిక వీళ్ళు యిలా ఉంటే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు పడే అవస్థ చూస్తుంటే చాలా జాలి,బాధ వేశాయి . పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ మధ్య మధ్యలో పెళ్ళి తతంగానికి అడ్డుపడుతూ వధూవరులతో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే , వాళ్లిద్దరూ అటు పెళ్ళిని ఎంజాయ్ చేయలేక యిటు సెల్ఫీలకి ఫోజులు యివ్వలేక పడుతున్న అవస్థ చూస్తుంటే చాలా జాలి వేసిందనుకోండి. యిలాంటప్పుడు నాకొచ్చే కోపానికి ఆ సెల్ ఫోన్ కనిపెట్టినవాడిని ఉప్పు పాతర వేయలనిపిస్తూ ఉంటుంది.
యిక పెళ్లి తతంగం ముగిసిన తరువాత అందరం కలసి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని యింటిముఖం పట్టాం.
యిదివరకు రోజుల్లో రేడియోలో ఎంచక్కా రోజూ భక్తి గీతాలు, వార్తలు,సంసృతంలో గురు శిష్యుల పాఠాలు , జానపద గీతాలు, జనరంజని,వనితా వాణి,ఆదివారం నాడు రేడియో అన్నయ్య,అక్కయ్య పిల్లలతో చెప్పించే పొడుపు కధలు,పాటలు,పద్యాలు, నీతి కధలు,మధ్యహ్నం పూట మన ధర్మ సందేహాలకి ఉషశ్రీ గారు యిచ్చే సమాధానాలు,నాటికలు,హరి కధలు,బుర్ర కధలు, మన్ చహే గీత్....యిలా ఒకటేమిటీ ఎన్నెన్నో కార్యక్రమాలు అన్ని చెవులారా వింటూ ఆనందించేవాళ్ళం . ఏమిటో ఈ సెల్ ఫోన్ల దెబ్బకి అందరి ఇళ్ళల్లో రేడియోలు మూల పడిపోయాయి.
ఎంతయినా ఆ రోజులే బాగుండేవి. అందరు ఒక చోట కూర్చుని సరదాగా మాట్లాడుకునేవాళ్ళం,పనులు చేసుకోవటానికి కూడా బోలెడంత సమయం ఉండేది.
చిన్నప్పుడు మనం మారాం చేసి ఏడుస్తుంటే అమ్మ మనల్ని బుజ్జగిస్తూ చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తే , యిప్పటి రోజుల్లో సెల్ ఫోన్ చంటి పిల్లల చేతికిచ్చి వాళ్ళు ఆదమరచి సెల్ ఫోన్ తో ఆడుకుంటున్నపుడు అన్నం తినిపిస్తున్న మోడరన్ తల్లులున్నారు .
అమ్మ లాలి పాట పోయి సెల్ ఫోన్ జోల పాటలొచ్చాయి.
అమ్మమ్మ చెప్పే చందమామ కథలు, పేదరాశి పెద్దమ్మ కధలు పోయి యు ట్యూబ్ కథలొచ్చాయి.
ప్లే గ్రౌండ్ ఆటలు పోయి టెంపుల్ రన్, క్యాండీ క్రష్ ఆటలొచ్చాయి.
కొత్త వింత,పాత రోత అంటే యిదేనేమో.మరి ఉంటానండి. వీలు చూసుకుని మళ్ళీ కలుస్తా.

Comments
Post a Comment