యిల్లాలి ముచ్చట్లు
ఆగండర్రా.. అలా లేచి వెళ్ళి పోతారే.ఈ వేళ నేను రావటం కొంచెం ఆలస్యం అయ్యింది సుమీ.అసలేం జరిగిదంటే మా సుజాత అక్క కొడుకూ, కోడలు ఈ రోజు పొద్దున్నే చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చారు. వాళ్ళు అలా హటాత్తుగా వచ్చేసరికి నా కాళ్ళు, చేతులు ఆడలేదనుకోండి.మొత్తానికి వాళ్ళిద్దరికి జీడీ పప్పు ఉప్మా చేసి పెట్టి,ఫలహారాలు అయిన తరువాత టీ నీళ్ళతో గొంతు తడుపుకుని వాళ్ళని అలా సాగనంపి,నేను యిలా వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయ్యిందన్న మాట.అది సంగతి.
ఇంకా ఏమిటర్రా సంగతులు.డిసెంబరు నెల కూడా వచ్చేసిందాయే.ఈ నెల తిరిగిందంటే ఆ పై వచ్చేది సంక్రాంతి.యిక సంక్రాంతి ముగ్గులు,గొబ్బెమ్మలు, హరిదాసులు, చలి మంటలు,గంగిరెద్దుల మేళం,కొత్త పంట చేతికొచ్చే కాలం,ఊరంతా సందడే సందడి. పండుగ డిస్కౌంట్లతో షాపుల వాళ్ళు ఉదరకొట్టేస్తారు.అన్నట్లు వదినా... డిస్కౌంట్ అంటే జ్ఞాపకం వచ్చింది. నీకు ఈ విషయం చెప్పలేదు కదూ. ఈ రోజు మా చక్రి గాడు మొట్టమొదటిసారి కోడలు పిల్లతో సహా మా యింటికి వచ్చాడు కాదా. కొత్త పెళ్లికూతురికి పెడదాం అంటే సమయానికి నా దగ్గర కొత్త చీరలు లేకపోతివి .కనీసం మొన్న దసరాకి కొనుక్కున్న నా చీర పెడదామనుకుంటే అలాంటి చీరలు మా కోడలు పిల్ల కట్టదాయే. యిక చేసేది లేక బొట్టు పెట్టి రవికల గుడ్డ పెడితే మా చక్రి గాడు అది చూసి ఏమన్నాడో తెలుసా..."పిన్ని నువ్వు యిప్పుడు రవికల గుడ్డ పెట్టావు,దీనికసలే షాపింగ్ పిచ్చి.యిప్పుడు దీనికి మాచింగ్ చీర కొనిపెట్టమంటుంది" అని అనేసరికి నాకు పుసుక్కున్న నవ్వు వచ్చింది.కానీ మా కోడలు చూస్తే బాగుండదని వచ్చే నవ్వు కష్టపడి ఆపుకున్నా.వదినా, యిప్పుడైతే పండుగ డిస్కౌంట్లు యిస్తారుట కదా.అలా నువ్వు షాపింగ్ కి వెళ్ళినపుడు నాకు కూడా రెండు చీరెలు తెచ్చిపెడుదు.నీకు మీ అన్నయ్య గారి సంగతి తెలిసిందేగా. యిలాంటి షాపింగ్ లంటే ఎలా తప్పించుకుందామా అని చూస్తారు. ఆయన తీసుకుని వెళ్ళరు ,నన్ను వెళ్ళనివ్వరు.ఏం అనుకోకు .నా చీరల సంగతి మరిపోవద్దు.
అదిగో మీ అన్నయ్యగారు నిద్ర లేచినట్లున్నారు. పిలుస్తున్నారు.మరి నే వస్తా వదినా.మళ్ళీ కలుస్తా.వదినా,మంచి ముదురు రంగు చీరలు తీసుకో.మరిచిపోకూ.. ఆ...వస్తున్నానండి.

Comments
Post a Comment