మా యింటి పండుగ సందడి
వినాయక చవితి ముందు రోజు సాయంకాలం ఆఫీసు నుండి త్వరగా వచ్చేసిన మా శ్రీవారు ,నేనూ ఎప్పటిలానే ఈ యేడు కూడా మేము యిద్దరమే పండుగ పూజా సామాను కొనటానికి బయలుదేరాం.అప్పటికీ షాపింగ్ కి రమ్మనమని పిల్లలిద్దరిని అడిగా.నేను చాలా బిజీ అంటూ మా అబ్బాయి,మీతో షాపింగ్ బోర్ అంటూ మా అమ్మాయి తప్పించేసుకున్నారు.వీళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారో... ఏమిటో అని నేను అనుకుంటూ యిదే విషయం ఈయనతో చెబితే తెలుసుకుంటారులేవోయ్...వాళ్ళు ఇంకా చిన్న పిల్లలేగా అని అంటూ నవ్వుతూ తేలిగ్గా కొట్టిపారేశారు.ఏం చేస్తాం..వాళ్ళు అలా,ఈయన యిలా...
మేము యిద్దరం లిస్ట్ ప్రకారం పూజ సామాను కొనుక్కుని ఆఖరికి గొడుగు,మట్టి వినాయకుడి ప్రతిమని కూడా కొనేసి ఇంటికి వచ్చే దారిలో అందరికి టిఫిన్స్ పార్సెల్ చేయించుకుని వచ్చాము. అలా నేను గుమ్మలోకి అడుగు పెట్టగానే మా అమ్మాయి పరుగున వచ్చి ఆత్రంగా నా చేతిలోని వినాయకుడి ప్రతిమని అందుకుని లోపలకి వెళ్ళిపోయింది.పోనీలే ... కనీసం ఈ పని అయినా చేసిందిలే అని నేను అనుకుంటూ లోపలకి వెళ్ళి చూసేసరికి అది వినాయకుడి ప్రతిమతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది. అది చూసి ఒళ్ళు మండి నేను తిడుతూ వుంటే యింతలో మా పుత్రరత్నం ఆఘమేఘాల మీద బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి,పరుగు పరుగున లోపలకి వస్తుంటే ఏమైందా..అని నేను కంగారు పడేలోపు,"ఏమిటమ్మా.. వినాయకుడిని ఇంటికి తీసుకుని రాగానే నాకు ఫోన్ చేసి చెప్పామన్నాగా....ఇప్పుడు చూడు, నా కంటే ముందు చెల్లి వాట్సాప్ లో ఫోటోలు పెట్టెసింది" అని నామీద విసుక్కుని వీడు కూడా సెల్ఫీలు తీసుకోవటం మొదలుపెట్టాడు .పూజ కాకుండా అలా ఫోటోలు తీసుకోకూడదని నేను ఎంత చెబుతున్నా వాళ్ళ గోల వాళ్ళదే...
టెఫిన్స్ తినేసి యిక పండుగ పనులు మొదలు పెడదాం అని అనుకునేలోపు బయట పని ఉంది అంటూ మా అబ్బాయి,నిద్ర వస్తోంది అంటూ మా అమ్మాయి అక్కడినుండి మెల్లిగా జారుకున్నారు.ఇది అలవాటు అయిపోయిన తంతు కాబట్టి నేను పాలవెల్లి అలంకరణ చేస్తూ ఉంటే,మా అత్తగారు మరుసటి రోజుకి కావాల్సిన పూజ సామాను సర్దేసి పడుకుండిపోయారు. టీవీలో వేస్తున్న గుండమ్మ కధ సినిమాలొ లీనమైపోయిన ఈయన మొబైల్ కి ఇంతలో వాట్సాప్ మెసేజ్ వచ్చింది.ఈ టైంలో మెసేజ్ చేసేది ఎవరా అని చూస్తే పక్క రూంలో ఉన్న మా అమ్మాయి పండుగ శుభాకాంక్షలు చెబుతూ మేసేజ్ చేసింది.టైం అప్పుడే పన్నెండు అయిపోయిందా ఆని అనుకుని అంతలోనే ఇది ఇంకా నిద్ర పోకుండా ఏమి చేస్తోందా అని చూసేసరికి అందరికి వాట్సాప్ లో పండుగ శుభాకాంక్షలు మెసేజ్ పెడుతూ, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తోంది.అప్పుడే వీడు కూడా బైక్ దిగుతూనే మొబైల్ లోఅందరికి మేసేజ్ చేస్తూ వచ్చాడు. ఎంత తిట్టినా వీళ్ళు మారరు కదా...
పొద్దున్న గుడి నుండి వినిపించే సుప్రభాతం, వాకిట్లో వేసిన రంగవల్లి,గుమ్మానికి కట్టిన మావిడాకులతో ఇంటికి పండుగ కళతో పాటు మా ఇంట్లో పండుగ సందడి కూడా మొదలైపోయింది .పండుగ స్నానాలు కానిచ్చి నేను వంట ప్రయత్నాల్లో వుంటే,మా అత్తగారు పూజకి కావాల్సిన లిస్ట్ చెబుతుంటే ఈయన,పిల్లలు పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వంట త్వరగా అయితే పూజ చేసుకోవచ్చని ఉండ్రాళ్ళు చేయమని మా అమ్మాయికి చెప్పి నేను పులిహోరలో పోపు వేసి కలపబోతుంటే,అప్పటికే ఆలస్యం అయ్యిందంటూ నన్ను పూజకి రెడి అవ్వమని చెప్పి మా అత్తగారు పులిహోరని కలపసాగారు.కూతురు ఒక్కటే కష్టపడివుతోంది అనుకుని ఈయన మా అమ్మాయికి సాయం చేయసాగారు. ఇంతలోనే ఆకలికి ఆగలేని మా అబ్బాయి ఫ్రిడ్జిలో స్నాక్స్ వెతుకుతుంటే దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఏమీ తినకూడదని వాడిని తిట్టి, నా వంట పని అక్కడితో పూర్తి కానిచ్చేసి పిల్లల పుస్తకాలు,ఈయన ఆఫీస్ ఫైల్స్ కూడా మండపం దగ్గర పెట్టి వినాయక పూజ ప్రారంభించాం. మా అత్తగారు మా అందరితో పూజ చేయిస్తుంటే అక్కడ కూడా మా పిల్లలిద్దరూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ మాతో చివాట్లు తింటూ పోటీలు పడి వినాయకుడికి పత్రి పూజ చేసేసి,నైవేద్యం పెట్టిన తరువాత అక్షంతలు తల మీద చల్లుకుని స్వామి వారికి దణ్ణం పెట్టుకుని ఆకాలేస్తోంది అంటూ అటు వచ్చి ,ఇటు వచ్చి పులిహోర,పాయసం,గారెలు తినేయటం మొదలు పెట్టారు. అప్పటికే మద్యాహ్నం ఒంటిగంట అవటంతో మాకు కూడా ఆకలి వేసి అందరం కలిసి పండుగ భోజనం చేసేసాం.
సాయంకాలం పూజ కూడా కానిచ్చి ఆనవాయితీ ప్రకారం తొమ్మిది వినాయకుడి ప్రతిమలను దర్శించుకుందామని అందరం కలసి బయలుదేరివెళ్ళాం. ఒకదాన్ని మించి మరొక వినాయక ప్రతిమలు చాలా అందంగా ఉన్నాయి. యీసారి కొంతమంది భక్తులు గంధపు చెక్కలతో, టెంకాయలతో ...యిలా రకరకాల వినాయక విగ్రహాలు కూడా ప్రతిష్టించారు.సినిమా ప్రభావం వినాయకుడిని కూడా వదిలిపెట్టలేదు. కొత్తగా బాహుబలి వినాయకుడు కూడా వెలిశాడు.
మనలో మన మాట...ఎంచక్కా మట్టితో చేసిన బొజ్జ వినాయకుడిని చూస్తే కలిగే భక్తి పారవశ్యం బాహుబలి వినాయకుడిని చూస్తే వస్తుందా చెప్పండి...
ఒక మండపంలో చక్కగా మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే,వాళ్ళకీ పోటీగా ఎదురు సందులో ఉన్న మండపంలో సినిమా పాటలు లౌడ్ స్పీకర్లు పెట్టి ఉదరగొట్టేశారు. ఆ పాటలకు చిందులేస్తున్న కుర్రాగ్యాంగ్ ని అతికష్టంమీద దాటుకుని కష్టపడి వినాయకుడి దర్శనం చేసుకున్నా. ఏ మాట కామాటే చెప్పుకోవాలి.చిరు బొజ్జతో నిండుగా కొలువు తీరిన వినాయకుడు ఎంతో అందంగా ఉన్నాడు.అలా స్వామిని చూడగానే నేను ఎంతో భక్తిగా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నంతసేపూ స్పీకర్స్ లో కెవ్వు కేక....ఓ రత్తాలు.... కెవ్వు కేక ....
అని పెద్దగా పాట వస్తూనే ఉంది.ఈ పాట గోల లో స్వామి వారికి అసలు నా ప్రార్ధన వినిపిస్తోందా అని అనిపించింది.చేసిన పాపం చెబితే పోతుందని అంటారు .నా ప్రార్థనలో నేను కూడా రెండు,మూడు సార్లు కెవ్వు కేక.. అని అన్నట్లు లీలగా గుర్తు .యింత గోలలో కూడా మా అమ్మాయి కళ్ళు మూసుకుని పాడేస్తూ ఉంటే దేవుడి పాట పాడుతోందనుకుని శ్రద్ధగా విన్నా.ఆ సినిమా పాటకి కోరస్ యిచ్చేస్తూ ఇది పాడుకుంటూ ఉంటే మా పుత్రరత్నం ఆ పాటకి రిధమిక్ గా స్టెప్పులు వేస్తూ క్యూలో నడుస్తున్నాడు. .పండుగ నాడు పిచ్చి పనులు చేస్తే పాపం...చెంపలేసుకోండి అని పిల్లలిద్దరిని తిట్టి అక్కడనుండి లాక్కుని వచ్చేశా.
యిలా లెక్కకి మించి వినాయకుడి విగ్రహాలని చూసి వాళ్ళు యిచ్చిన పులిహోర,శనగలు,అటుకులు బెల్లం ప్రసాదాలు తినగలిగినంత తిని బయలుదేరి వస్తుంటే...ఒరేయ్ అన్నయ్యా!ఎందుకో ఈ రోజంతా అమ్మ తిడుతూనే ఉందిరా అని నా కూతురు అంటుంటే,మా పుత్రరత్నం కూడా వాళ్ళ నాన్నలానే అదేమి పట్టించుకోకు అని తేలిగ్గా అనేసి వాళ్ళు ఈరోజు వినాయకుడి మండపాల్లో విన్న లేటెస్ట్ సినిమా పాటల గురించి మాట్లాడుకుంటూ ఉంటె, మా వారు నా వంక చిరు కోపంగా చూస్తూ నేనూ పొద్దున్నుండి చూస్తూనే ఉన్నా, ఎందుకోయ్...ఈ రోజు పిల్లలని అంతలా తిడుతున్నావు అని అడిగారు.మీకెమి తెలీదు.. మీరు వూరుకోండి.వినాయక చవితి నాడు పిల్లలని ఎంత తిడితే వాళ్ళని అంతగా దీవించినట్లని అంటారు అని పిల్లల వంక మురిపంగా చూసుకుంటూ అని నేను అంటే మా శ్రీవారు కూడా నవ్వుకుని అవును కదా.... నువ్వు చెబుతుంటే గుర్తుకు వస్తోంది, చిన్నప్పుడు మా అమ్మ కూడా పండుగ నాడు నన్ను యిలానే తిట్టెది , మరి నేను కూడా పిల్లలని తిట్లతో దీవిస్తా అని అంటూ రోడ్ మీద ఆ సినిమా కబుర్లు ఏంటి మీకు.. అని ఈయన పిల్లలని గట్టిగా గదమాయించేసరికి మా అమ్మాయి ఒక్క క్షణం వాళ్ళ నాన్న వంక ఆశ్చర్యంగా చూసి అంతలోనే ఒక్క పరుగున వచ్చి నాన్న చేయి అందుకుని మా నాన్నకి నటించటం రాదు అని అనేసరికి ఈయన కూతురి వంక నవ్వుతూ మురిపంగా చూసుకుంటూ కూతురి చేయీ మరింత ప్రేమగా పట్టుకుని నడుస్తుంటే,మా అబ్బాయి మాత్రం నీకు నేను ఉన్నాగా అన్నట్లుగా నా భుజాల చుట్టూ చేయీ వేసి నాతో కలిసి నడుస్తూ ఇంటిదారి పట్టాం.

Comments
Post a Comment