Posts

Showing posts from October, 2017

మా బడి మాకెంతో ఇష్టం...

Image
   రోజులు మారిపోతున్నాయి అని అనుకునే కంటే మనం మారిపోతున్నాం అని అనుకుంటే బాగుంటుందేమో.ఎందుకంటే రోజులు ఎప్పటిలా వాటి మానాన అవి సాగిపోతున్నాయి.కానీ మార్పు వచ్చింది వాటిల్లో కాదు, మనలో. అర్థం కాలేదా...కొంచం క్లారిటీ యిస్తా..ఉండండి.మన చిన్నప్పుడు మనం అమ్మానాన్నల మాట వింటూ పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం.యిప్పుడు కూడా మనం అదే పని చేస్తున్నాం.కానీ  మనలో చిన్న మార్పు ...మనం యిప్పటికీ మన పెద్దవాళ్ళ మాటకి విలువ యిస్తున్నాం,మన పిల్లలు చెప్పేది కూడా వింటున్నాం.యిదంతా ఎందుకు చెబుతున్నానంటే నాలో వచ్చిన ఈ మార్పు మీ అందరిలో కూడా వచ్చింది, వస్తూనే ఉంది కాబట్టి.... నిన్న ఏం జరిగిందంటే... యిదేమి అంత పెద్ద విషయం కాదు లెండి.అయినా మీ అందరితో చెప్పుకోవాలనిపించి చెబుతున్నా...కొంచెం ఓపిక చేసుకుని చదవండి.   ఆ......యిక అసలు విషయానికి వస్తున్నా.నిన్న మా అమ్మాయి పెన్స్ కొనుకోవటానికి డబ్బులు అడిగింది.వారం క్రితమే అరడజను పెన్స్  కొన్నావుగా అని నేనంటే,అవి ప్రాక్టీకల్స్ కి వాడేశా.ఇప్పుడు థియరీ ఎక్సమ్స్ కి మళ్ళీ కావాలి అని అనేసి వెళ్ళిపోయింది.ఏం చెబుతాం...ఈ జనరేషన్ పిల్లలకి....చెబితే వింటారా?.అంతా use and throw వ్యయహారం