మా అమ్మమ్మ ఊరు... సంక్రాంతి పండుగ.
జనాన్ని తోసుకుంటూ ఎలాగో అలా కష్టపడి బస్ ఎక్కి ఆఖరి వరుసలో ఉన్న సీట్ సంపాదించి కూర్చున్నానో లేదో బస్సు బయలుదేరింది. రాత్రి కురిసిన మంచుతో తడిసిన పచ్చని పొలాలు అప్పుడప్పుడే తొంగి చూస్తున్న సూర్యుని కిరణాలు పడి వింత కాంతితో మెరిసిపోతూ ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. నా ఆలోచనలు గతంలోకి పరుగులు తీయటం మొదలు పెట్టాయి. సంక్రాంతి పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి బస్సులో వెళ్తుంటే దారి పొడవునా పచ్చటి పొలాలు , ఎడ్లబండ్ల మీద చెరుకు తీసుకెళ్తున్న రైతులు ఎదురుపడేవారు.ఊరు దగ్గర పడుతోందనటానికి గుర్తుగా రోడ్డు పక్కనే ఉన్న అంబేత్కర్, గాంధీ తాత,సుభాష్ చంద్ర బోస్ నాయకుల విగ్రహాలు కనిపిస్తూ ఉండేవి.అవి దాటిన తరువాత అమ్మ చదువుకున్న గవర్నమెంటు స్కూల్ యిప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.రాజు గారి కోట దగ్గర బస్సు ఆగగానే ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మయ్యలు ఎదురొచ్చి చేతిలో లగేజీ తీసుకుని అమ్మమ్మ యింటికి తీసుకుని వెళ్తుంటే దారిలో కనిపించే చిన్న గుడి భ్రమరాంబ తల్లి,పెద్ద గుడి వేణుగోపాల స్వామికి గుడి బయట నుండే దణ్ణం పెట్టుకుని ,ఆప్యాయంగా పలకరిస్తున్న ఊరి జనం కుశలప్రశ్నలకి బదులిస్తూ యింటికి వెళ్ళే వాళ్ళం.అ