Posts

Showing posts from September, 2020

చినుకులా రాలి... నదులుగా సాగి

Image
బాలు... మొట్టమొదటిసారి  నీ గురించి స్వర్గీయ అని రాయటానికి ఎందుకో చేతులు వణుకుతున్నాయి . మనస్సు అంగీకరించటంలేదు.కన్నీటితో నిండిపోయిన నా కళ్ళకి అక్షరాలు అలికేసినట్లుగా కనిపిస్తున్నాయి .గుండె పిండేస్తున్న బాధ.ఈ వార్త నిజం కాకూడదు...కల అని చెప్పు దేవుడా అని వెక్కివెక్కి ఏడవాలనిపిస్తోంది.కానీ యిదే  నిజం అని పదే పదే చెబుతున్న న్యూస్ చానెల్స్.వాట్సాప్ న్యూస్. నమ్మక తప్పని నిజం.      అప్పుడే వెళ్లిపోయావా బాలు.ఎందుకంత తొందర.?.యింకొన్నాళ్ళు మాతో ఉంటే బాగుండేది కదా. నీ పాట లేని ఇల్లు ఉంటుందా ఎక్కడైనా?.   యిన్నాళ్ళు మా మధ్యే ఉంటూ రోజూ నీ పాటతోనే పలకరించే నువ్వు యిక లేవని ఎలా నమ్మమంటావు?. మళ్ళీ త్వరగా వెనక్కి తిరిగి వచ్చేస్తానని మాట యిచ్చి యిలా ఎందుకు చేశావు బాలు..?.మన మధ్య ఉన్న బంధం ఈ నాటిదా..?రోజూ తన పాటతో పలకరించే మా బాలు యిక లేడన్న విషయం ఎలా నమ్మమంటావు?.     నువ్వు  మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా నీ పాటలు అమరం. అవి ఎప్పటికి మాతోనే ఉంటూ నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. నిన్ను తలచుకున్నప్పుడల్లా  ఆ రోజుల నుండి నిన్నటివరకుఎన్నెన్నో జ్ఞాపకాలు. కుర్రాళ్ళోయ్...కుర్రాళ్ళు... అంటూ యూత్ తో పాటు ముసలివాళ్ళని