Posts

Showing posts from August, 2017

తీపి తీపి తెలుగు...

Image
అమ్మ అనే అక్షరాలల్లో ఉన్న తియ్యదనం, నాన్న అన్న పిలుపులో ఉన్న కమ్మదనం నాకు తెలుసింది నా మాతృభాషవల్లే...     అన్న,తమ్ముడు,అక్క,చెల్లి అని పలకరించే పిలుపుల్లో, వీళ్ళు నా వాళ్ళు అన్న హక్కుతో కూడుకున్న చనువు,ఆప్యాయత తెలిసింది నాకు నా మాతృభాష వల్లే...        దెబ్బ తగిలి అమ్మా..అని అరిచినా, భయం వేసి అమ్మ.. అని పిలిచినా,ఆ రెండింటికి అర్థం,తేడా తెలిసింది నా మాతృభాష వల్లే...   ఆనందం వచ్చినా,భాధ కలిగినా మనసారా వ్యక్తపరచగలిగేది నా మాతృభాషలోనే...      ఒరేయ్ అన్నా, ఏరా అని పిలిచినా వెంటనే అంతే చనువుగా ఏంట్రా...ఏంటో చెప్పారా అని బదులు పలికేది నా మాతృభాషలోనే...          ఏరా మావ , ఒరేయ్ బామ్మరిది అనే పిలుపుల్లో ఉన్న స్వచ్ఛమైన స్నేహం కనిపించేది నా మాతృభాషలోనే...    మాతృభాషని,మాతృభూమిని ఎప్పటికి మరిచిపోవద్దంటూ కోరుకుంటూ....    మీ అందరికీ తెలుగుభాషా దినోత్సవ   శుభాకాంక్షలు

ప్రేమతో.....అమ్మ

Image
చిట్టి తల్లి....       చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు నా  జీవితం అనే పుస్తకం పేజీలని వెనక్కి తిప్పి చూసుకుందాం అని అనుకుంటే .ఆశ్చర్యం...ఆ పేజీల నిండా నీ జ్ఞాపకాలే, నీవు చేసిన గుర్తులే....నా కోసం నేను ఎంత వెతుక్కున్నా...నా జాడ కనిపించలేదు ఎక్కడా.....అనుమానం వచ్చి ఇది నా జీవితమేనా అని మరల మరల తిప్పిన పేజీలనే ముందుకి,వెనక్కి, మరింత వెనక్కి తిప్పిచూసుకున్నా.అరె.....నేనేమైపోయాను.నా జ్ఞాపకాలు,నా అనుభూతులు ఏవి?.నిన్నటి దాకా నా గురించి నాకు రాని ఆలోచన ఇప్పుడే ఎందుకు వస్తోంది? యీ ప్రశ్నని పదే పదే నన్ను నేను వేసుకుని చూస్తే నేను అమ్మనైన తర్వాత మొదటిసారి నిన్ను ఎత్తుకున్న క్షణం నీవు క్యార్...క్యార్ మంటూ, ఇక నుండి  అమ్మ నాకే సొంతం అని నీ భాషలో చెప్పినట్లనిపించింది.నీ బోసి నవ్వులతో,చిన్ని చిన్ని తప్పటడుగులు నావైపు  వేస్తూ,నీ చిట్టి చేతులతో నన్ను హత్తుకుపోయిన క్షణం నుండి నా ప్రపంచం నీవే అయిపోయావన్న సంగతి ఇప్పటికి తెలిసివచ్చింది నాకు.  నీ చిన్ని నేస్తంగా మారిపోయూ నే బొమ్మల పెళ్లిళ్లు చేసిన జ్ఞాపకం.చిన్నప్పుడు చదవలేక వదిలేసిన హిందీ,సంస్కృతం అమ్మనైన తర్వాత  నీ కోసం నే నేర్చుకుని నీకు నేర్పుస్తూ పోటీ పడ

అమ్మ చేతి ముద్ద

Image
అమ్మ చేతిలో ఏముందో ఏమిటో తెలియదు కానీ ఆకలి లేదంటూ మారం చేస్తున్న నాకు అమ్మ ఆకాశంలో చందమామని చూపిస్తూ కధలు చెబుతూ ఎంతో ప్రేమగా గోరుముద్దలు పెడుతూ వుంటే నేను ఆకాశంలో నక్షత్రాలని లెక్క పెట్టుకుంటూ అమ్మ చెప్పే కథలకి ఊ.. కొడుతూ అన్నం తినేసి అలానే అమ్మ ఒడిలో నిద్ర పోయాను.కలలో దేవుడు నా నేస్తం కన్నయ్యలా కనిపించి నాతో ఎన్నో ఆటలాడుకున్నాడు.మేము ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడుకున్నాం,చిటారు కొమ్మలెక్కి చిలుక కొట్టిన దోర జామపండ్లు కోసుకుని తిన్నాం,ఆ పైన దాహం వేసి సెలయేటి నీళ్లు తాగి,అంతటితో ఊరుకోకుండా ఒకరితో ఒకరు పోటీ పడి పరుగు పందాలు వేసుకున్నాం.ఆడి ఆడి అలసిపోయిన సన్ను కన్నయ్య తన వేణుగానంతో ఎంతో సేపు మురిపించాడు. వేణుగానం ఆగేసరికి ఉలిక్కిపడి చుట్టూ చూసిన నేను అమ్మ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా బిక్కమొహం వేసుకుని కన్నయ్య నన్ను ఎంతగా పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇంటికి పరుగు తీశాను. నా బిక్కమొహం చూసిన కన్నయ్య కూడా పరుగు తీస్తూ మా ఇంటికి వచ్చేశాడు. అలా నేను గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మ పరుగు పరుగున వచ్చి నన్ను అక్కున చేర్చుకుని," ఇంతసేపూ ఎక్కఫున్నావురా బుజ్జి?.నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా&qu