తీపి తీపి తెలుగు...
అమ్మ అనే అక్షరాలల్లో ఉన్న తియ్యదనం, నాన్న అన్న పిలుపులో ఉన్న కమ్మదనం నాకు తెలుసింది నా మాతృభాషవల్లే...
అన్న,తమ్ముడు,అక్క,చెల్లి అని పలకరించే పిలుపుల్లో, వీళ్ళు నా వాళ్ళు అన్న హక్కుతో కూడుకున్న చనువు,ఆప్యాయత తెలిసింది నాకు నా మాతృభాష వల్లే...
దెబ్బ తగిలి అమ్మా..అని అరిచినా, భయం వేసి అమ్మ.. అని పిలిచినా,ఆ రెండింటికి అర్థం,తేడా తెలిసింది నా మాతృభాష వల్లే...
ఆనందం వచ్చినా,భాధ కలిగినా మనసారా వ్యక్తపరచగలిగేది నా మాతృభాషలోనే...
ఒరేయ్ అన్నా, ఏరా అని పిలిచినా వెంటనే అంతే చనువుగా ఏంట్రా...ఏంటో చెప్పారా అని బదులు పలికేది నా మాతృభాషలోనే...
ఏరా మావ , ఒరేయ్ బామ్మరిది అనే పిలుపుల్లో ఉన్న స్వచ్ఛమైన స్నేహం కనిపించేది నా మాతృభాషలోనే...
మాతృభాషని,మాతృభూమిని ఎప్పటికి మరిచిపోవద్దంటూ కోరుకుంటూ....
మీ అందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు

Comments
Post a Comment