మైమరపించిన వేణుగానం....
నీ మువ్వల సవ్వడి విని నిన్ను వెతుకుతూ నే వస్తే నీ నుండి రాలి పడిన జాజి పువ్వులు , నీ లేత పాదాలను ముద్దాడిన యీ పచ్చిక బయళ్ళు ఈ దారి వెంటే నీవు నడిచి వెళ్ళావని చెప్పకనే చెబుతున్నాయి. నీవు నడిచి వెళ్ళిన దారంతా రాలిపడిన యీ పొగడపువ్వులు,నిన్ను తాకి వింత కాంతితో మరింత అందంగా మెరిసిపోతున్న యీ వెండి వెన్నెల నీ స్పర్శతో పులకరించిపోతూ ఈ దారి వెంటే నీవు నడిచి వెళ్ళావని చెప్పకనే చెబుతున్నాయి. కురుస్తున్న ఈ వెన్నెల వానలో పురి విప్పి నాట్యమాడిన మయూరి,ఎల్లప్పుడూ నిన్నంటి వుండే ఈ చందన పరిమళం నీవెంతో దూరంలో లేవని చెప్పకనే చెబుతున్నాయి. గలగలా పారె సెలయేటి సవ్వడి నీ నవ్వులా అనిపించి,ఒక్క క్షణం నే పొరబడి, నిన్ను చేరుకోవాలన్న ఆత్రంలో నా అడుగులు తడబడి నీకై వెతికి వెతికి ,నీవు కానరాక.....బరువెక్కిన మనసుతో కనురెప్పల తెరచాటు నుండి కారి,జారిపోతున్న కన్నీటితో వెనుతిరిగి వస్తుంటే .....దూరంగా వినిపించిన నీ మధుర వేణు