Posts

Showing posts from March, 2018

క్షణక్షణముల్ ఆడవాళ్ళ చిత్తముల్...

Image
            ప్రేమ,ఆప్యాయత,అనురాగం అనుకుంటూ కూర్చోబట్టి అందరితో నేను  యిన్నిన్ని మాటలు పడుతున్నానంటూ ఆవేశంగా  మాట్లాడుతూ  నా శ్రీమతి  నా దగ్గరకి  వచ్చేసరికి కంగారు పడిన  నేను చదువుతున్న పేపర్ పక్కన పడేసి అసలేమి జరిగిందో  అర్థం చేసుకోవటానికి  ప్రయత్నించేలోపు అలా చూస్తూ ఉండకపోతే ఏమి జరిగిందో అడగొచ్చు కదా నా వంక చూస్తూ నిష్ఠురంగా  అనేసరికి  యిలాంటప్పుడు మాట్లాడితే ఒక తంటా,మాట్లాడకపోయినా మరో తంటా అని నాలో నేను అనుకుంటూ అయినా  రోట్లో తల పెట్టిన తరువాత రొకలిపోటుకి వెరవటం  ఎందుకని లేని దైర్యం  కూడగట్టుకొని అసలేమి జరిగింది బంగారం.... అని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ అనేసరికి అసలు యిదంతా మీ వలనే అంటూ రివర్స్ గేర్ లో తిట్ల డైరెక్షన్ నావైపు గురి పెట్టింది.ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే యిదే కాబోలు అని నాలో నేను అనుకుంటూ నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు మీరు మధ్యలో మాట్లాడకండి,యిదంతా మీవల్లే ... అందుకే అంటారు పుణ్యం కొద్ది పురుషుడు,దానం కొద్ది బిడ్డలు అని.. ఆయినా  మా వాళ్ళు పెళ్లి చూపుల రోజే చెప్పారు తొందర పడకు ఒక్క వారం  రోజు ఆగు. ఢిల్లీ  కుర్రాడు కూడా నిన్ను చూసుకోవటానికి వస్తున్నాడు.ఆ సంబంధం

సీతారాముల కళ్యాణం ...చూతము రారండి

Image
    శ్రీరామనవమి అంటే మా చిన్నప్పుడు బీసెంట్ రోడ్డులో తాటాకులతో వేసే చలువ పందిళ్ళు పగలంతా షాపింగ్ చేసుకునే వాళ్ళకి హాయి గోలుపుతూ ఉంటే అవే పందిళ్ళు రంగు రంగుల బల్బులతో రాత్రిపూట మరింత అందంగా ప్రకాశిస్తూ ఉండేవి. వాటిని చూడటానికి షాపింగ్ చేయటానికి వచ్చే పోయే జనం బీసెంట్ రోడ్డు మధ్యలో అందంగా  అలంకరించబడిన  సీతారాముల గుడిని  దర్శించుకుని వడపప్పు పానకం ప్రసాదాలు తీసుకుని నాలుగు అడుగులు ముందుకు వేసి దాహం వేస్తోందన్న  మిషతో పనిగట్టుకొని  సందులోకి  వెళ్ళి పుష్పాల రంగయ్య షాపులో గోళి సోడా  తాగేసి తృప్తిగా త్రెంచేసి మరొక్క రెండు అడుగులు  బీసెంట్ రోడ్డు వైపు వేసి  ఒక చేతిలో డబ్బులు పెట్టగానే మరో చేయెత్తి దీవించే బొజ్జ వినాయడుకి విగ్రహం వద్ద   క్యూలో నిలబడి మరీ స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుని సాక్షాత్తు ఆ వినాయకుడే ఆశీర్వదించినంతగా ఫీల్ అయిపోతూ నడుచుకుని ముందుకు వస్తుంటే  అక్కడకి రాగానే గుప్పుమని వచ్చే చేపల మార్కెట్ వాసనలతో దాదాపు రోడ్డు చివరకి వచ్చేసాం అని గుర్తుకి రాగానే  ఖచ్చితంగా యిక్కడే ఉండాలే అని ఆత్రంగా వెతికేలోపు యిదిగో యిక్కడున్నా అన్నట్లుగా రోడ్డు పక్కగా ఉన్న  చిన్న గుడిలో బొజ్జ వినాయకు

ఉ(మెన్స్) డే

Image
        ఐదింటికే నిద్ర  లేచిన నేను వారం రోజులుగా పని మనిషి రాకపోవటంతో యింటి పని,వంట పని చేసేస్తూ  పిల్లలకి లంచ్ బాక్స్ రెడి  చేసేసినా ఎప్పటిలానే తాపీగా రెడి అయిన పిల్లలిద్దరిని స్కూలుకి ఆలస్యం అయిపోతోందంటూ తిడుతూ యింత గోడవలోను ముసుగు తన్ని ప్రశాంతంగా నిద్ర పోతున్న శ్రీవారిని చూసి సైలెంట్ గా పళ్ళు పటపటలాండించేస్తూ  అంతలోనే ఈయన  క్యాంప్ నుండి అర్థరాత్రి ఇల్లు చేరిన విషయం గుర్తుకొచ్చి నాలిక కొరుక్కుని హడావిడిగా పిల్లలిద్దరిని తీసుకుని నా పెళ్ళికి ముందే మా పుట్టింటివాళ్ళు కొనిచ్చిన స్కూటీ ఎంతకీ స్టార్ట్ అవ్వక మొరాయిస్తుంటే దాన్ని ఎలాగో అలా తంటాలు పడి స్టార్ట్ చేసి వెళ్తుంటే దారిలో   నా స్కూటీ చేసే చిత్రవిచిత్రమైన శబ్దాలకి నిద్రాభంగం అయిన కుక్క ఒకటి మీదకి ఉరుకుదామని చేసిన ప్రయత్నంలో నేను ఆ  కుక్కని గుద్దబోయీ, దాని నుండి తప్పించి ఎప్పుడో కురిసిన వర్షాలకి పడిన గుంటలో పడబోయీ నిభాయించుకుని బండిని ముందుకు పరుగు తీయించాను. అప్పటికే  బయలుదేరిపోయిన బస్సుని కొంత దూరం వెంటాడి, బస్సు డ్రైవర్, కండక్టర్లతో ఆలస్యంగా వచ్చినందుకు తివాట్లు తిని పిల్లలిద్దరిని బస్సు ఎక్కించేసి హమ్మయ్య అనుకుంటూ ఈ హడావిడిక