Posts

అమ్మ చేతి ముద్ద

Image
అమ్మ చేతిలో ఏముందో ఏమిటో తెలియదు కానీ ఆకలి లేదంటూ మారం చేస్తున్న నాకు అమ్మ ఆకాశంలో చందమామని చూపిస్తూ కధలు చెబుతూ ఎంతో ప్రేమగా గోరుముద్దలు పెడుతూ వుంటే నేను ఆకాశంలో నక్షత్రాలని లెక్క పెట్టుకుంటూ అమ్మ చెప్పే కథలకి ఊ.. కొడుతూ అన్నం తినేసి అలానే అమ్మ ఒడిలో నిద్ర పోయాను.కలలో దేవుడు నా నేస్తం కన్నయ్యలా కనిపించి నాతో ఎన్నో ఆటలాడుకున్నాడు.మేము ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడుకున్నాం,చిటారు కొమ్మలెక్కి చిలుక కొట్టిన దోర జామపండ్లు కోసుకుని తిన్నాం,ఆ పైన దాహం వేసి సెలయేటి నీళ్లు తాగి,అంతటితో ఊరుకోకుండా ఒకరితో ఒకరు పోటీ పడి పరుగు పందాలు వేసుకున్నాం.ఆడి ఆడి అలసిపోయిన సన్ను కన్నయ్య తన వేణుగానంతో ఎంతో సేపు మురిపించాడు. వేణుగానం ఆగేసరికి ఉలిక్కిపడి చుట్టూ చూసిన నేను అమ్మ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా బిక్కమొహం వేసుకుని కన్నయ్య నన్ను ఎంతగా పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇంటికి పరుగు తీశాను. నా బిక్కమొహం చూసిన కన్నయ్య కూడా పరుగు తీస్తూ మా ఇంటికి వచ్చేశాడు. అలా నేను గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మ పరుగు పరుగున వచ్చి నన్ను అక్కున చేర్చుకుని," ఇంతసేపూ ఎక్కఫున్నావురా బుజ్జి?.నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా&qu

ఉందిలే మంచి కాలం. ..ముందు ముందున

Image
      మొబైల్ లో  పాత సినిమా పాట...ఉందిలే మంచికాలం ముందు ముందున ...అని చిన్నగా వినిపిస్తోంది. చలికాలం అవ్వటంతో  నెమ్మదిగా చీకటితో పాటు చలిగాలి కూడా  పెరుగుతోంది. అప్పటిదాకా వాకింగ్ చేసి కాసేపు పాట వింటూ  రిలాక్స్ అవుదామని కూర్చున్నానో లేదో ఎవరో వస్తున్న అలికిడికి  నేను  వెంటనే మాస్క్ తగిలించేసుకుని జాగ్రత్త పడిపోయా.మా పక్క ఫ్లాట్ వాళ్ళు వాకింగ్ చేయటానికి టెర్రస్ మీదకి  వచ్చి నన్ను చూసి గబ గబా మాస్కులు తగిలించేసుకుని నాకు ఆమడ దూరంగా వాకింగ్ చేయటం మొదలు పెట్టారు. యిక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టెర్రస్ దిగి యింటికి వచ్చేసా.      ఈ కరోన దెబ్బకి మా డాబా మీద ట్రాఫిక్ బాగా  పెరిగిపోయింది.రోడ్డు మీద,పార్కులో వాకింగ్ చేసే  మా అపార్ట్మెంట్  వాసులు అందరూ   డాబా బాట పట్టారు.మాలో మేము ఒక ఒప్పందం చేసుకుని స్టిఫ్టుల ప్రకారం కొంతమంది పొద్దున్న,కొంతమంది సాయంకాలం  వాకింగ్ చేస్తున్నాం .        అబ్బాబ్బా... ఈ మాస్కులు వాడి వాడి  చెవులు విపరీతమైన మంట. యిలానే కొన్నాళ్ళు  పెట్టుకుంటే చెవులు ముందుకు పొడుచుకుని వచ్చి ఏలియన్స్ లా అయిపోవడం ఖాయం. అందరి మొహాలకి మాస్కులయితే ఉంటున్నాయి.  కానీ ఏం లా

చినుకులా రాలి... నదులుగా సాగి

Image
బాలు... మొట్టమొదటిసారి  నీ గురించి స్వర్గీయ అని రాయటానికి ఎందుకో చేతులు వణుకుతున్నాయి . మనస్సు అంగీకరించటంలేదు.కన్నీటితో నిండిపోయిన నా కళ్ళకి అక్షరాలు అలికేసినట్లుగా కనిపిస్తున్నాయి .గుండె పిండేస్తున్న బాధ.ఈ వార్త నిజం కాకూడదు...కల అని చెప్పు దేవుడా అని వెక్కివెక్కి ఏడవాలనిపిస్తోంది.కానీ యిదే  నిజం అని పదే పదే చెబుతున్న న్యూస్ చానెల్స్.వాట్సాప్ న్యూస్. నమ్మక తప్పని నిజం.      అప్పుడే వెళ్లిపోయావా బాలు.ఎందుకంత తొందర.?.యింకొన్నాళ్ళు మాతో ఉంటే బాగుండేది కదా. నీ పాట లేని ఇల్లు ఉంటుందా ఎక్కడైనా?.   యిన్నాళ్ళు మా మధ్యే ఉంటూ రోజూ నీ పాటతోనే పలకరించే నువ్వు యిక లేవని ఎలా నమ్మమంటావు?. మళ్ళీ త్వరగా వెనక్కి తిరిగి వచ్చేస్తానని మాట యిచ్చి యిలా ఎందుకు చేశావు బాలు..?.మన మధ్య ఉన్న బంధం ఈ నాటిదా..?రోజూ తన పాటతో పలకరించే మా బాలు యిక లేడన్న విషయం ఎలా నమ్మమంటావు?.     నువ్వు  మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా నీ పాటలు అమరం. అవి ఎప్పటికి మాతోనే ఉంటూ నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. నిన్ను తలచుకున్నప్పుడల్లా  ఆ రోజుల నుండి నిన్నటివరకుఎన్నెన్నో జ్ఞాపకాలు. కుర్రాళ్ళోయ్...కుర్రాళ్ళు... అంటూ యూత్ తో పాటు ముసలివాళ్ళని

ఆటబొమ్మలు

Image
        ఆకాశంలో  మెరుస్తున్న నక్షత్రాలని చూస్తూవుంటే  పోయినోళ్లు అలా నక్షత్రాలుగా మారిపోతారని చిన్నప్పుడు మా బామ్మ ఎప్పుడూ చెప్పే మాట గుర్తుకువచ్చి  ఏవేవో జ్ఞాపకాలతో  మనస్సు గతం వైపు పరుగులు తీసింది. కొన్ని జ్ఞాపకాలు నిన్న కాక మొన్నే జరిగినట్లుగా అనిపిస్తుంటే  మరికొన్ని జ్ఞాపకాలు లీలగా గుర్తుకొచ్చి రానట్లుగా ఉన్నాయి.కాలగర్భంలో కలిసిపోయిన కొందరి పాత్రలు ఎప్పటికి మరిచిపోలేనంతగా గుర్తుండిపోతే,మరికొందరి పాత్రలు అడుగు పెట్టినప్పటినుండి సందడి చేసేస్తూ అందరిని ఆప్యాయంగా పలకరించేస్తూ అంతలోనే  రసవత్తరంగా ఆడుతున్న నాటకం నుండి ఎవ్వరికీ మాట వరుసకైన చెప్పకుండా అర్థాంతరంగా తమ పాత్ర మధ్యలోనే ముగించేస్తూ నిష్క్రమిస్తే... ఆ బాధని దిగమింగుకుని వాళ్ళని మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ జ్ఞాపకాలు అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నాయి. తొందరపడి నువ్వు వెళ్లిపోయావు కానీ నువ్వుంటె చాలా బాగుండేది అని కొందరితో చెప్పాలనిపిస్తుంది.మరికొందరు చెప్పాపెట్టకుండా హఠాత్తుగా వెళ్లిపోయేసరికి ఉక్రోషంతో పోతే..పో,నాకేంటి...నువ్వు లేకుండా నేనుండలేనా  అని పైకి బింకంగా అన్నా, ఉన్నంతకాలం  నిన్ను,నీ ప్రేమని నేను సరిగ్గా అర్థం

క్షణక్షణముల్ ఆడవాళ్ళ చిత్తముల్...

Image
            ప్రేమ,ఆప్యాయత,అనురాగం అనుకుంటూ కూర్చోబట్టి అందరితో నేను  యిన్నిన్ని మాటలు పడుతున్నానంటూ ఆవేశంగా  మాట్లాడుతూ  నా శ్రీమతి  నా దగ్గరకి  వచ్చేసరికి కంగారు పడిన  నేను చదువుతున్న పేపర్ పక్కన పడేసి అసలేమి జరిగిందో  అర్థం చేసుకోవటానికి  ప్రయత్నించేలోపు అలా చూస్తూ ఉండకపోతే ఏమి జరిగిందో అడగొచ్చు కదా నా వంక చూస్తూ నిష్ఠురంగా  అనేసరికి  యిలాంటప్పుడు మాట్లాడితే ఒక తంటా,మాట్లాడకపోయినా మరో తంటా అని నాలో నేను అనుకుంటూ అయినా  రోట్లో తల పెట్టిన తరువాత రొకలిపోటుకి వెరవటం  ఎందుకని లేని దైర్యం  కూడగట్టుకొని అసలేమి జరిగింది బంగారం.... అని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ అనేసరికి అసలు యిదంతా మీ వలనే అంటూ రివర్స్ గేర్ లో తిట్ల డైరెక్షన్ నావైపు గురి పెట్టింది.ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే యిదే కాబోలు అని నాలో నేను అనుకుంటూ నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు మీరు మధ్యలో మాట్లాడకండి,యిదంతా మీవల్లే ... అందుకే అంటారు పుణ్యం కొద్ది పురుషుడు,దానం కొద్ది బిడ్డలు అని.. ఆయినా  మా వాళ్ళు పెళ్లి చూపుల రోజే చెప్పారు తొందర పడకు ఒక్క వారం  రోజు ఆగు. ఢిల్లీ  కుర్రాడు కూడా నిన్ను చూసుకోవటానికి వస్తున్నాడు.ఆ సంబంధం

సీతారాముల కళ్యాణం ...చూతము రారండి

Image
    శ్రీరామనవమి అంటే మా చిన్నప్పుడు బీసెంట్ రోడ్డులో తాటాకులతో వేసే చలువ పందిళ్ళు పగలంతా షాపింగ్ చేసుకునే వాళ్ళకి హాయి గోలుపుతూ ఉంటే అవే పందిళ్ళు రంగు రంగుల బల్బులతో రాత్రిపూట మరింత అందంగా ప్రకాశిస్తూ ఉండేవి. వాటిని చూడటానికి షాపింగ్ చేయటానికి వచ్చే పోయే జనం బీసెంట్ రోడ్డు మధ్యలో అందంగా  అలంకరించబడిన  సీతారాముల గుడిని  దర్శించుకుని వడపప్పు పానకం ప్రసాదాలు తీసుకుని నాలుగు అడుగులు ముందుకు వేసి దాహం వేస్తోందన్న  మిషతో పనిగట్టుకొని  సందులోకి  వెళ్ళి పుష్పాల రంగయ్య షాపులో గోళి సోడా  తాగేసి తృప్తిగా త్రెంచేసి మరొక్క రెండు అడుగులు  బీసెంట్ రోడ్డు వైపు వేసి  ఒక చేతిలో డబ్బులు పెట్టగానే మరో చేయెత్తి దీవించే బొజ్జ వినాయడుకి విగ్రహం వద్ద   క్యూలో నిలబడి మరీ స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుని సాక్షాత్తు ఆ వినాయకుడే ఆశీర్వదించినంతగా ఫీల్ అయిపోతూ నడుచుకుని ముందుకు వస్తుంటే  అక్కడకి రాగానే గుప్పుమని వచ్చే చేపల మార్కెట్ వాసనలతో దాదాపు రోడ్డు చివరకి వచ్చేసాం అని గుర్తుకి రాగానే  ఖచ్చితంగా యిక్కడే ఉండాలే అని ఆత్రంగా వెతికేలోపు యిదిగో యిక్కడున్నా అన్నట్లుగా రోడ్డు పక్కగా ఉన్న  చిన్న గుడిలో బొజ్జ వినాయకు

ఉ(మెన్స్) డే

Image
        ఐదింటికే నిద్ర  లేచిన నేను వారం రోజులుగా పని మనిషి రాకపోవటంతో యింటి పని,వంట పని చేసేస్తూ  పిల్లలకి లంచ్ బాక్స్ రెడి  చేసేసినా ఎప్పటిలానే తాపీగా రెడి అయిన పిల్లలిద్దరిని స్కూలుకి ఆలస్యం అయిపోతోందంటూ తిడుతూ యింత గోడవలోను ముసుగు తన్ని ప్రశాంతంగా నిద్ర పోతున్న శ్రీవారిని చూసి సైలెంట్ గా పళ్ళు పటపటలాండించేస్తూ  అంతలోనే ఈయన  క్యాంప్ నుండి అర్థరాత్రి ఇల్లు చేరిన విషయం గుర్తుకొచ్చి నాలిక కొరుక్కుని హడావిడిగా పిల్లలిద్దరిని తీసుకుని నా పెళ్ళికి ముందే మా పుట్టింటివాళ్ళు కొనిచ్చిన స్కూటీ ఎంతకీ స్టార్ట్ అవ్వక మొరాయిస్తుంటే దాన్ని ఎలాగో అలా తంటాలు పడి స్టార్ట్ చేసి వెళ్తుంటే దారిలో   నా స్కూటీ చేసే చిత్రవిచిత్రమైన శబ్దాలకి నిద్రాభంగం అయిన కుక్క ఒకటి మీదకి ఉరుకుదామని చేసిన ప్రయత్నంలో నేను ఆ  కుక్కని గుద్దబోయీ, దాని నుండి తప్పించి ఎప్పుడో కురిసిన వర్షాలకి పడిన గుంటలో పడబోయీ నిభాయించుకుని బండిని ముందుకు పరుగు తీయించాను. అప్పటికే  బయలుదేరిపోయిన బస్సుని కొంత దూరం వెంటాడి, బస్సు డ్రైవర్, కండక్టర్లతో ఆలస్యంగా వచ్చినందుకు తివాట్లు తిని పిల్లలిద్దరిని బస్సు ఎక్కించేసి హమ్మయ్య అనుకుంటూ ఈ హడావిడిక

మా అమ్మమ్మ ఊరు... సంక్రాంతి పండుగ.

Image
    జనాన్ని తోసుకుంటూ ఎలాగో అలా కష్టపడి బస్ ఎక్కి ఆఖరి వరుసలో ఉన్న సీట్ సంపాదించి కూర్చున్నానో లేదో బస్సు బయలుదేరింది. రాత్రి కురిసిన మంచుతో తడిసిన పచ్చని పొలాలు అప్పుడప్పుడే తొంగి చూస్తున్న సూర్యుని కిరణాలు పడి వింత కాంతితో మెరిసిపోతూ ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. నా ఆలోచనలు గతంలోకి   పరుగులు తీయటం మొదలు పెట్టాయి.       సంక్రాంతి  పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి బస్సులో వెళ్తుంటే దారి పొడవునా పచ్చటి పొలాలు , ఎడ్లబండ్ల మీద చెరుకు తీసుకెళ్తున్న రైతులు ఎదురుపడేవారు.ఊరు దగ్గర పడుతోందనటానికి గుర్తుగా రోడ్డు పక్కనే ఉన్న అంబేత్కర్, గాంధీ తాత,సుభాష్ చంద్ర బోస్ నాయకుల విగ్రహాలు కనిపిస్తూ ఉండేవి.అవి దాటిన తరువాత అమ్మ చదువుకున్న గవర్నమెంటు స్కూల్ యిప్పటికీ  చెక్కు చెదరకుండా అలానే ఉంది.రాజు గారి కోట దగ్గర బస్సు ఆగగానే ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మయ్యలు ఎదురొచ్చి చేతిలో లగేజీ తీసుకుని అమ్మమ్మ యింటికి తీసుకుని వెళ్తుంటే దారిలో కనిపించే చిన్న గుడి భ్రమరాంబ తల్లి,పెద్ద గుడి వేణుగోపాల స్వామికి గుడి బయట నుండే దణ్ణం పెట్టుకుని ,ఆప్యాయంగా పలకరిస్తున్న ఊరి జనం కుశలప్రశ్నలకి బదులిస్తూ యింటికి వెళ్ళే వాళ్ళం.అ